ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..

0
44

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ జరిపే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇస్తే జోక్యం చేసుకోవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది… ఫామ్ 10 ఇవ్వని చోట ఫలితాలు నిలుపుదల చేయాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్న స్పష్టం చేసింది.