రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులపైన పోలీసుల అమానుష దాడిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు.

0
55

రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులపైన పోలీసుల అమానుష దాడిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎ ఎమ్ డి ఆర్ ఏ అధికారులు, కాంట్రాక్టర్లు నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గు చేటు అన్నారు . క్రిస్టమస్, నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా కూడా ప్రభుత్వం కార్మికులను పస్తులు పెట్టడం అన్యాయం అన్నారు . బకాయి జీతాలు చెల్లించమని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపైన ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని కెవీపియస్ ఖండిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండించాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధిక మంది దళిత, గిరిజన పేదలు ఉన్న రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు, హరిత రాయబారులకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు…