అనసూయకు కరోనా లక్షణాలు ? సోషల్ మీడియాలో పోస్ట్…

0
89

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే స్ట్రెయిన్ రూపంలో కొత్త కరోనా వైరస్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇక కరోనాకు పేదా, గొప్ప, ఆడా, మగ, చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అమితాబ్, రాజమౌళి, తమన్నా, రామ చరణ్, వరుణ్ తేజ్, రకుల్, దర్శకుడు క్రిష్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. మిగతా వాళ్లు కరోనా నుంచి కోలుకున్నా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం కరోనా కారణంగా కన్నుమూసారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా జబర్థస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయకు తనకు కరోనా లక్షణాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ రోజు ఉదయం కర్నూలులో ఓ ప్రోగ్రామ్ కోసం బయలు దేరుతుంటే.. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు అనిపించింది. దీంతో ఆ ప్రోగ్రామ్‌ను క్యాన్సిల్ చేసుకున్నానని అనసూయ వివరణ ఇచ్చింది. కొంచెం సేపు అయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటామని చెప్పింది.
ఈ సందర్భంగా గత కొన్నిరోజులుగా తనకు కలిసివాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. అనసూయ గురించి చెప్పాల్సి వస్తే.. జబర్థస్త్‌కు ముందు.. తర్వాత అనే చెప్పాలి. తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘కథనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు.ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో నటిస్తోంది.