బహుజనుల శక్తీ ఎప్పుడు తెలుసుకుంటారు బహుజనులు ఎప్పుడు రాజ్యం ఏలేది

0
59

మహారాష్ట్ర లో ఒక యూనివర్సిటీకీ, అంబెడ్కర్ గారి పేరు పెట్టాలని 16 సంవత్సరాలపాటు ఉద్యమం జరిగింది.‌ దానిలో 6 మంది పోలీసుల లాఠిచార్జీలో మరణించారు. వేలమందికి గాయాలయ్యాయి. అయినా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

1995 ఎలక్షన్ లో #మాన్యవర్_కాన్షీరాం మహారాష్ట్ర వెళ్ళి ఎలక్షన్ సభలో BSP పార్టీకి ఓటేయండి చాలు ఒక యూనివర్సిటీ పేరే కాదు మీరు కోరుకోకుండానే ఎన్నో వాటికి బహుజన నాయకుల పేరు పెడతాం అన్నారు.
అంతే రాత్రికి రాత్రే శరద్ పవార్ ఆ యూనివర్సిటీకీ అంబెడ్కర్ గారి పేరుపెట్టి, అంబెడ్కర్ గారి పేరుమీదే పెద్ద స్టేడియం కడతానని ప్రకటించారు.

16 సంవత్సరాల ఉద్యమంలో ఎంతో నష్టపోయారు మహారాష్ట్ర దళితులు కానీ ఒక్క ప్రకటన #ఓటుమాకువేయండి అనేసరికి #మనఓటుమనకు_వేసుకుందాం అనే సరికి రాత్రికి రాత్రే పేరు మారిపోయింది.

కిటుకు ఎక్కడ ఉంది. అర్దమౌతోందా?
ఉత్తర ప్రదేశ్ లో కాన్షీరాంగారు BSP పాలన కాలంలో అడగకుండానే ఎన్నో యూనివర్సిటీలకు, స్టేడియాలకు, జిల్లాలకు బహుజన నాయకుల పేర్లు పెట్టించారు. తర్వాత మాయావతి గారు కూడా కొనసాగించారు.

ఏది కావాలన్నా అడుక్కునే అలవాటు మాని ఓటుతో సాధించుకుందాం అనే #కాన్షీరాంగారి మాట పాటిద్దాం

కుల సంఘాల #నాయకులుగా ఓటుహక్కు గురించి చెప్పండి. మన ఓటు మన పార్టీలకే అని చెప్పండి. అంతేకానీ ఓట్లు వేరే వాళ్ళకి వేసి వాళ్ళనీ ప్రాదేయపడటం మానేయండి

ఇక నుంచి దానికి పేరు పెట్టండి దీనికి పేరు పెట్టండి అని అడగకండి.
“మన ఓటు మనకే వేసుకుందాం మనకు కావాల్సింది మనమే చేసుకుందాం” అనండి అనే నినాదం జనంలోకి బాగా తీసుకెళ్దాం.