నా చిరకాల వాంఛను నెరవేరుస్తున్నా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
బుజబుజ నెల్లూరులో రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

0
56

నెల్లూరు కార్పొరేషన్ బుజ బుజ నెల్లూరుకు సంబంధించి స్మశాన వాటికను నిర్మించాలన్నది నా చిరకాల వాంఛ…. ఎట్టకేలకు నెరవేరుస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.. బుజ బుజ నెల్లూరు పరిధిలో మంగళవారం రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుమారు కోటి రూపాయల వ్యయంతో స్మశాన వాటిక పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. బుజ బుజ సర్వీస్ రోడ్ లేక ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని దీనిపై తాను నిరంతరం పోరాటం చేశానన్నారు. బుజబుజ నెల్లూరు ప్రజల అభిమతానికి అనుగుణంగా రూ 43 లక్షల అంచనాలతో సర్వీస్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందన్నారు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ పనులు జరుగుతాయని ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోటంరెడ్డి పేర్కొన్నారు. బుజబుజ నెల్లూరు, కొత్తూరు వంటి ప్రాంతాల్లో పేద ప్రజలు నివసిస్తున్నారని వారి అభివృద్ధే ధ్యేయంగా తాను నిరంతరం పని చేస్తున్నానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసు నాయుడు, హరిబాబు యాదవ్ తాటి వెంకటేశ్వర్లు ,నరసింహ గిరి, రామకృష్ణ , గోపాల్, రమేష్ పాల్గొన్నారు