రెండు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న రైతుభరోసా డబ్బులు వారి వారి అకౌంట్లలో పడ్డ నేపధ్యంలో సంక్షేమ సంఘం నాయకులను ఆత్మీయంగా సన్మానించిన మహిళలు, మన జాతి రైతులు

0
71

✍️ ఈ రోజు 3/1/2021 యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం బృందం బాలాయపల్లి మండలం జయంపు ST కాలనీలో పర్యటించడమైనది.
✍️ గతంలో ఈ కాలనీలో పర్యటించిన సందర్బంగా రైతు భరోసా అందలేదని మన వాళ్లు చెప్పారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా డబ్బులు పడ్డాయి. ఇంకా కొంతమందికి రావాల్సి ఉందని, ఇతర సమస్యలను సంక్షేమ సంఘం దృష్టికి తీసుకురాగా వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమైనది.
✍️ రెండు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న రైతుభరోసా డబ్బులు వారి వారి అకౌంట్లలో పడ్డ నేపధ్యంలో సంక్షేమ సంఘం నాయకులను ఆత్మీయంగా సన్మానించిన మహిళలు, మన జాతి రైతులు
✍️ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కోట్లపాటి వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటకృష్ణయ్య, దయాకర్, శంకరయ్య, పెంచలమ్మ పాల్గొన్నారు.