ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తికరమైన ఉత్తర్వులను జారీ చేసింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీ చేసింది.

0
68

=> లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే… వాటికి సంబంధించిన యజమానికి రూ. 500 ఫైన్ విధించనున్నారు. అంతేకాదు, రోజుకు రూ. 250 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

=> ఒకవేళ అవి తమవంటూ ఎవరూ ముందుకు రాకపోతే… వాటిని వీధి కుక్కలు, పందులుగా గుర్తించి… వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారు. కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే… తిరిగి 10 రోజుల్లోగా లైసెన్స్ ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

=> యజమానులకు లైసెన్స్ అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాలని ఆదేశించింది. ఈ జంతువులకు టోకెన్లను జారీ చేయాలని తెలిపింది. ఈ టోకెన్లు వాటి మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది..