సర్వేపల్లిలో వైభవంగా ఇళ్ల పట్టాల పంపిణీ.”

0
53

“సర్వేపల్లిలో వైభవంగా ఇళ్ల పట్టాల పంపిణీ.”

తేది:26-12-2020
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పధకం కింద ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు, ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, సీఈఓ శ్రీమతి సుశీల గారు, ఆర్డివో హుస్సేన్ సాగర్ గారు, భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

ఇళ్ల పట్టాల పంపిణీకి కాకాణి రాక సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, స్వాగతం పలికిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

👉 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, పేదవారికి సొంతిల్లు అందించడం నెరవేరుతున్న సందర్భంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.

👉 తెలుగుదేశం పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి, మహాయజ్ఞం లాంటి పేదవారికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది.

👉 పేదవారి సొంతింటి కలలు సాకారమవుతున్న సందర్భంగా సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

👉 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకే విడతలో 30 లక్షల 75 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో నా చేతుల మీదుగా 18వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం.

👉 లబ్ధిదారుని చేతికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పంపించే విధంగా కాకుండా, లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లుగా విభజించి, కేటాయింపులు పూర్తిచేసి, లేఅవుట్లలో ప్లాట్లు పంపిణీ చేయడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

👉 ఇళ్ల స్థలాల పట్టాలు అందించిన వెంటనే లబ్ధిదారులు జగనన్న తమకు కేటాయించిన ప్లాటును చూసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు.

👉 సర్వేపల్లి నియోజకవర్గం లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు అందించే బాధ్యత నాది.

👉 సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు గ్రామాల్లో అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

👉 గతంలో మంత్రిగా వెలగబెట్టి అభివృద్ధిని విస్మరించి, అవినీతి, అక్రమ సంపాదనే ధ్యేయంగా పని చేసిన “పులిరాజా” ను పట్టించుకోవలసిన అవసరం లేదు.

👉 ప్రజలకు ముఖం చాటేసి, ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే ఆలోచన చేసే వ్యక్తుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు.

👉 ఇళ్ల పట్టాల పంపిణీ సజావుగా సాగడానికి కారకులైన జిల్లా ఉన్నతాధికారుల నుండి గ్రామ స్థాయి ఉద్యోగుల వరకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

👉 శాసన సభ్యునిగా రెండుసార్లు ఆదరించి, ఆశీర్వదించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.