తోక కట్ చెయ్యాలా – వార్నింగ్ ఇచ్చిన సీ.ఎం. జగన్

0
80

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో ఎక్కడికక్కడ అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. ముందుగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్త స్వరం వినిపించడంతో ప్రారంభమైన ఈ అసమ్మతులు క్రమక్రమంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తూ వస్తున్నాయి. ఆనం వైఖరితో జగన్ విసుగు చెంది వార్నింగ్ ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లింది. ఆ తర్వాత ఆనం సైలెంట్ అయినా నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు చేసిన… చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు.

రఘు వ్యవహారం పార్టీ ఇమేజ్‌ను చాలా వరకు డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ అయితే ఏకంగా ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌, పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పరుషంగా మాట్లాడడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది.