ఇక నైనా మేలుకో బహుజన మేలుకో ఏ దేశాన్ని ఏలుకో

0
65

ఈ రాజ్యం ఇంకా BC లకు SC లకు,ST లకు కల్పించిన అన్ని హక్కులు ఎందుకు కల్పించడం లేదు

స్వతంత్ర భారత దేశం లో రాజ్యాంగం రాసె అవకాశం వచ్చిన తరువాత DR. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు దానిలో SC, ST, OBC, మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించారు.అవి అన్ని కూడా అధికరణలు,సూత్రాల రూపం లో మనం రాజ్యాంగం లో చూడవచ్చు.

వాటికి కృషి ఫలితంగా ఆర్టికల్ 15(4),16(4) ఇవి వచ్చాయి,

ఆర్టికల్ 15(4) సమాజికంగాను,విద్య పర్ణగాను వెనుకబడిన పేదలకు OR SC, ST పౌరుల పరిస్థితిని మెరుగు పరచడానికి ఎటువంటి కార్య చరణ అయిన చేపట్టే అధికారం ఇస్తుంది.

ఆర్టికల్ 16(4) ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల వారికి రెజర్వేషన్ లు కల్పించే అధికారాన్ని ఇస్తుంది.ఇక్కడ వెనుక బడిన తరగతులు అనగా SC, ST & OBC లు.

ఆ విధముగా విద్య ఉద్యోగ రంగాలలో కల్పించిన రెజర్వేషన్ ల కారణం గా ఈ అణగారిన సుద్ర కులాల నుండి విద్య వంతుల వర్గం ఒకటి ఈ స్వతంత్ర భారతం లో పుట్టింది.

వీలు ఎం చేస్తున్నారు? సాటి సమాజం ఇంకా అభివృద్ధి కి నోచుకోవట్లేదు.దీనికి ఒకటే మార్గం మన పార్టీ ఈ దేశ ,రాష్ట్ర రాజకీయాలలో ముందుండాలి,
అలా ఉండాలి అంటే మేధావు వర్గం మాత్రమే పని చేయాలి ఎందుకంటే సాటి సుద్ర ప్రజలు ఇవ్వాల ఇంకా బతకడం కొరకు పోరాడుతున్నారు,వారి స్థితి గతులు మారాలి అంటె మేధావు వర్గం EMI లలో బంది కాకుండా బాహ్య ప్రపంచం లో సమాజ జాగరణ కు పుణుకోవాలి.

మేధావి వర్గాన్ని కట్టడి చేయడం కోసం మనువాద పాలకులు ఈ రోజు ఉద్యోగుల మీద ఉన్న ఆంక్షలు ఎత్తి వేయాలి
1) పార్టీ కార్య క్రమాలలో పాల్గొన కూడదు ఇది ముమ్మాటికీ మేధావి వర్గ అణచివేత

2) పార్టీ లలో సభ్యత్వం ఉండకూడదు ఇది మేధావి వర్గాన్ని రాజకీయ
ముగా పాల్గొన కుండ
చైతన్యం చేయకుండా అడ్డుకోవడమే.
కానీ వారు ఎత్తి వేయరు.

శత్రువు మేధావి వర్గాన్ని ఎలా అణిచి వేయాలో ఎత్తుగడ వేస్తుంటే అదే అదనుగా మనం దానిని చూపిస్తూ మన సమాజాన్ని మోసం చేస్తున్నాము,మన సమాజ చైతన్యం లో పాల్గొనకుండా ఉంటున్నాము.

ఇప్పటికి దీని నుండి కాపాడగల,ఆ ఎత్తుగడలను పట పంచలు చేయగల BAMCEF ఉంది ఆ వేదిక ద్వారా అయిన మనం జాతి సేవ చేద్దాము,జాతిని రాజకీయ చైతన్యం చేసి,రాజకీయ శక్తి గా మార్చి,రాజ్యాధికారం లో వద్దాం.
ఇక నైనా మేలుకో బహుజన మేలుకో


బహుజన్ రమేష్ నాయక్
BHEL DEPUTY MANAGER