సర్వేపల్లిలో పండుగలా ఇళ్ల పట్టాల పంపిణీ”

0
60

“సర్వేపల్లిలో పండుగలా ఇళ్ల పట్టాల పంపిణీ”

తేది:25-12-2020
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” పథకం కింద లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకాణి.

లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు, ఇళ్లు మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.

ఇళ్ల పట్టాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులను సత్కరించి, ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉 రాష్ట్రంలో ఈ రోజు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి పర్వదినాలతో పాటు, పేద వారికి ఇళ్ల స్థలాలు అందించే పండుగలా జరుపుకునే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు.

👉 ఇళ్ల స్థలాల పంపిణీకి హాజరైన జనసందోహాన్ని చూస్తూంటే, పేదవారి గురించి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు సముచిత నిర్ణయం తీసుకోవడం జరిగింది.

👉 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లస్థలాల కోసం 8000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

👉 తెలుగుదేశం పార్టీ అనేక రకాలైన అడ్డంకులు సృష్టించినా, కోర్టులకు వెళ్లి నిరోధించడానికి ప్రయత్నించినా, వాటినన్నింటిని అధిగమించి, ఈ రోజు పట్టాల పంపిణీ చేయడం సంతోషంగా ఉంది.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి వివాదాలు సృష్టించాలని ప్రయత్నించి, తెలుగుదేశం నాయకులు భంగపడ్డారు.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ సజావుగా జరిగితే, తమకు పుట్టగతులుండవని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టా అందించే బాధ్యత నాది.

👉 ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రేయింబవళ్లు శ్రమించినా అధికారులకు, సహకరించిన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

👉సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ విజయవంతంగా సాగడానికి, కోర్టు కేసులను సమర్థవంతంగా ఎదుర్కొని, అవరోధాలను తొలగించి, పట్టాల పంపిణీకి ప్రధాన కారకులైన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

👉 సొంత ఇంటి కల నిజం చేసుకుంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ, ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.