రేపే పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం…

    0
    56

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలో ఉన్న సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి గురువారం సాయంత్రం పిఎస్ఎల్వీ – సి 50 రాకెట్ ను ప్రయోగించనుంది. ప్రయోగానికి సంభందించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలా 41 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25 గంటల సుదీర్ధ కౌంట్ డౌన్ అనంతరం పిఎస్ఎల్వీ – సి 50 రాకెట్ రేపు మధ్యాహ్నం 3 గంటలా 41 నిముషాలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా సిఎమ్ఎస్ – 01 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ ప్రయోగం నేపద్యంలో ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ తిరుమల, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేేక పూజలు నిర్వహించారు. తర్వాత షార్ కు చేరుకుని కౌంట్ డౌన్ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు.