18 న విజయవాడలోసెమి క్రిష్టమస్ వేడుకలు

0
52

• ఎ 1 కన్వెషన్లో ఈ నెల 18 న సెమి క్రిష్టమస్ వేడుకలు .. సెమిక్రిష్టమస్ వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన రెడ్డి .. • కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు .. -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా .. క్రిష్టమస్ పండుగ పురస్కరించుకుని ఈ నెల 18 వ తేదీ శుక్రవారం విజయవాడ ఏ 1 కన్వెషన్ లో సెమిక్రిష్టమస్ ( హై – టీ ) వేడుకలను కోవిడ్ నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా చెప్పారు . బుధవారం నగరంలోని ఏ 1 కన్వెషన్ లో నిర్వహించే సెమిక్రిష్టమస్ ఏర్పాట్లను ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ , మైనారిటీ సంక్షేమశాఖ మేనేజింగ్ డైరెక్టరు రాజ్ కుమార్ , జిల్లా కలెక్టరు ఏ.యండి . ఇంతియాజ్ , పామర్రు శాసన సభ్యులు కైలే అనీల్ కుమార్ , జాయింట్ కలెక్టరు ( సంక్షేమం ) కె . మోహన్ కుమార్ లతో కలిసి డిప్యూటి ముఖ్యమంత్రి అంజాద్ భాషా పరిశీలించారు . కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ హై – టీ కార్యక్రమ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు . ఈసందర్భంగా డిప్యూటి సియం అంజాద్ భాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీఏటా క్రిష్టమస్ సందర్భంగా హై – టీ కార్యక్రమాన్ని నిర్వాహణలో భాగంగా ఈనెల 18 వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు నగరంలోని ఏ 1 కన్వెన్షన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు . ఈకార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు . కరోనా మహమ్మారి నేపథ్యంలో బిషప్స్ , ఫాస్టర్లు , ముఖ్యమైన క్రైస్తవ సోదరులతో సుమారు 300 మంది పరిమిత సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు . ఈకార్యక్రమంలో హాజరయ్యేందుకు జారీ చేసిన పాస్ కలిగినవారిని అనుమతించడం జరుగుతుందన్నారు . మైనారిటీస్ సంక్షేమాధికారి ఈకార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి. నాయకులు దేవినేని అవినాష్ , రజియా సుల్తానా , తదితరులు పాల్గొన్నారు .