గంగవరం పోర్ట్ ఆధాని కొనుగోలు వెనుక హస్తమేవరిది..శైలజానాథ్

0
17

విజయవాడ: గంగవరం పోర్ట్ ఆకస్మికంగా అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం వెనుక ఎవరి హస్తముందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ప్రశ్నించారు. బీవోవోటీ ఒప్పందాన్ని బయటకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2007లో ఏర్పాటు చేసిన పోర్ట్ 30 ఏళ్ళ తరవాత ప్రభుత్వపరం కావాల్సిఉందన్నారు. 14 ఏళ్లకే ప్రైవేట్‌పరం కావడం వెనుక మతలబు ఏంటని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ వెంచర్‌కు ఆనాడు కేంద్రం అనుమతి ఇవ్వనందని తెలిపారు. డీవీఎస్ రాజు 58-1 శాతం, దుబాయ్ కంపెనీ 31.5 శాతం, ప్రభుత్వం 10.39 శాతంతో గంగవరం పోర్టు ఏర్పాటైందని గుర్తుచేశారు. అసలు జాయింట్ వెంచర్‌తో ఏర్పాటైన ఈ పోర్ట్‌ను అమ్మే హక్కు ఎవరికి ఉండదన్నారు. ప్రైవేట్‌కు అప్పగించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహంలేదని శైలజానాధ్ పేర్కొన్నారు.