మోదీ ప్రసంగం పై కాంగ్రెస్ విమర్శలు

0
16

దేశంలో కొవిడ్ పరిస్థితిని ఉద్దేశించి సోమవారం దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. అయితే ఓవైపు మోదీ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ విమర్శల దాడి ప్రారంభించింది. ”మోదీజీ.. ప్రసంగం కాదు క్షమాపణ చెప్పండి” అంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నినదించింది. వాస్తవానికి కొవిడ్‌పై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఓడిపోయిందని, అయితే దాన్ని కప్పిపుచ్చి ఏదో సాధించామని మోదీ అబద్దాలు చెప్పడం ఏంటని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

”కొవిడ్ వల్ల లక్షల మంది చనిపోతున్నారు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కెమెరా ముందుకు వచ్చిన మోదీ అబద్ధాలు చెబుతున్నారు” అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. నేటి ప్రసంగంలో ఉచిత వ్యాక్సీన్‌పై మోదీ చేసిన ప్రకటనపై కూడా అనేక విమర్శలు వెలువడుతున్నాయి. మాటలే కానీ చేతలు ఉండవని, గతంలో ఇలాంటి అనేక ప్రకటనలు చేసినప్పటికీ వాస్తవంలో ఏం జరిగిందనేది దేశం మొత్తానికి తెలుసంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.