ST సామాజిక వర్గానికి చెందిన బుల్లియ్య మరణంపై న్యాయ విచారణ జరిపించాలి

0
19

ST సామాజిక వర్గానికి చెందిన బుల్లియ్య మరణంపై న్యాయ విచారణ జరిపించాలి
తమ నిర్లక్ష్యంను కప్పిపుచ్చుకోవడానికి కుట్రలు పన్నిన దేవస్థానం కమిటీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

  • ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ డిమాండ్.
    ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని కనక నాగవరపమ్మ దేవస్థానం నందు అనధికారికంగా వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ST సామాజికవర్గానికి చెందిన బుల్లియ్య
    విద్యుత్ ఘాతంతో ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మరణించాడు.
    బుల్లియ్య మరణించిన విషయాన్ని రహస్యంగా ఉంచి వారి కుటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పి గుట్టుచప్పుడుగా అంతిమ దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాటు చేశారు. బుల్లయ్య కుమార్తె అమరావతిలో వృత్తిరీత్యా ఉండటంతో …. లాక్ డౌన్ కారణంగా ఆమె బుధవారం ఉదయం రావడం జరుగుతుందని సమాచారం.
    దేవస్థానం వ్యవహారాలు నిర్వహిస్తున్న కమిటీ నాయకులు బండ్ల వెంకటేశ్వర రావు అలియాస్ బాబు మరియు అచ్చింశెట్టి భాను లు బుల్లయ్య కరెంట్ షాక్ కు గురైన తరువాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయకుండా…. ఈ వ్యవహారం బయటకు పొక్కితే ప్రాబ్లమ్స్ వస్తాయంటు… రామన్నపేట పంచాయితీ పారిశుద్ధ్య పనులు నిర్వహించే ట్రాక్టర్ లో బుల్లియ్య మృతదేహాన్ని నేరుగా అతని ఇంటికి తరలించారు. బండ్ల బాబు ఆదేశాల మేరకు బుల్లియ్య వడదెబ్బ తగిలి చనిపోయాడని చెప్పవలసిందిగా కుటుంబ సభ్యులను బెదిరించినట్లు గా స్థానికులు చెబుతున్నారు.
    ఈ ఘటనలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు గా గ్రామంలో ప్రచారం జరుగుతోంది. సోమవారం దేవస్థానం వద్ద మోటార్ వినియోగించి నీళ్ళు వాడుకున్న భక్తులకు కూడా కొంతమందికి కరెంటు షాకులు కొట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
    *బండ్ల వెంకటేశ్వర రావు అలియాస్ బాబు మరియు అచ్చింశెట్టి భాను ల కనుసన్నల్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగు లోనికి తీసుకు వచ్చి కుట్రలపై చర్యలు తీసుకోవాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు.