జూన్ 3,4 తేదీల్లో జరుగు నిరసనలు జయప్రదం చెయ్యండి….

0
9


జూన్ 3,4 తేదీల్లో జరుగు నిరసనలు జయప్రదం చెయ్యండి….
అండ్ర మాల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవీపియస్ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు, వైద్యం అందించాలని, ప్రతీ కుటుంబానికి కేరళ తరహాలో నిత్సావసర వస్తువులు ఇవ్వాలని, ప్రతీ కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు, సచివాలయాలు వద్ద నిరసనలు తెలియజేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు. కరోనా మహమ్మారి రెండవ వే లో ఉపాధి కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం ప్రయత్నం చెయ్యడం లేదు. అందరికీ వ్యాక్సిన్, ఆక్సిజన్, మందులు ఇవ్వలేదు. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. నివారణకు ఏమాత్రం ప్రయత్నం చెయ్యడం లేదు. ఈ సమయంలో దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయి. ముద్దాయిలను అరెస్టు చెయ్యలేదు . కరోనా లో ఉపాధి కోల్పోయిన దళితులకు కేరళ ప్రభుత్వం తరహాలో నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, దళితులపై దుర్మార్గమైన దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సబ్ ప్లాన్ నిధులు దళితులకు ఖర్చు చెయ్యాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. అభినందనలతో.... అండ్ర మాల్యాద్రి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి