లక్షదీవుల్లో గుజరాత్ గూండాలు – 2

0
12

లక్షదీవుల్లో గుజరాత్ గూండాలు – 2

లక్షదీవులకు పరిపాలనాధికారులుగా ఇప్పటి వరకూ IAS అధికారులే నియమింపబడ్డారు. కానీ మొదటి సారి మోదీ ప్రభుత్వం ప్రపుల్ల పటేల్ (Praful Khoda Patel) అనే గుజరాత్ రాజకీయనాయకున్ని, వ్యాపారిని నియమించింది. పోనీ ఇతడి చరిత్ర ఏమైనా సచ్చరిత్రా అంటే అదీ లేదు.

ఈ పటేల్ తండ్రి RSS నాయకుడు. మోదీ ఓ వెలుగులోకి రాక ముందు ఈయన్ని కలుస్తూ వుండేవారు. బహుశా ఆ ప్రేమతో కావచ్చు, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నపుడు సొహ్రోబుద్దీన్ కేసులో అమిత్ షా జైలుకు వెళితే ఆ హోం మంత్రి పదవిని ఇతనికి కట్టబెట్టాడు. దీన్నిబట్టే అర్థం అవుతుంది, వీడు ఆ ఇద్దరి దుర్మర్గులకూ ఎంత దగ్గరివాడో! అయితే 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. 2014లో మోది ప్రధాని అయ్యాక పనిలేక గోళ్ళు గిల్లుకుంటున్న వీన్ని 2016లో దాద్రా నగర్ హవేలి మరియు డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిపాలనాధికారిగా నియమించారు.

అప్పుడేం చేశాడు.

డామన్‌లో సముద్రాన్ని ఆనుకొని వున్న విలువైన ఆదివాసుల స్థలంపై కన్ను వేశాడు. డామన్ లైట్‌హౌస్ నుండి జంపోర్ బీచ్ మధ్యన వున్న ఆ స్థలం కొందరు ఆదివాసులకు చెందింది. వాళ్ళు తరాలుగా అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రస్తుతం UKలో నివసిస్తున్న కొందరు ఎన్నారైలకూ అక్కడ స్థలం వుంది. ఆదివాసీల నిరసనలని పట్టించు కోకుండా వాళ్ళను ఇళ్ళనుండి గెంటివేసి ఆ ఇళ్ళను కూల్చివేశాడు. లబోదిబోమంటున్న ఈ ఇళ్ళవారిని దగ్గర్లోని రెండు స్కూలు భవనాలను తాత్కాలిక జైళ్ళుగా మార్చి నిర్బందించాడు. వాళ్ళ ఇళ్ళను కూల్చి వీధిలో పడేశాక కనీసం పరిహారం ఇవ్వమంటే “ఇంటిలోనుకు ధరఖాస్తు చేసుకోండి, అర్హులైతే పరిశీలించి లోను ఇప్పిస్తాను.” అన్నాడు. వాళ్ళకు ఇప్పటికీ న్యాయం జరగలేదు గానీ అలా వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి స్వాధీనం చేసుకొన్న స్థలంలో ఒక లగ్ఝరీ రిసార్ట్(The Fern Seaside Luxurious Tent Resort) వెలిసింది.

అంతేనా… దాద్రా నగర్ హవేలీలో ఏం చేశాడు.

దాద్రా నగర్ హవేలీ పార్లమెంటు సబ్యుడుగా 21 ఏళ్ళు పైన పనిచేసిన మోహన్‌భాయ్ సంజిభాయ్ డెల్కర్ (Mohanbhai Sanjibhai Delkar) అనే ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాడు. ఈ మోహన్‌భాయ్ డెల్కర్ ఆదివాసీల తరపున పదేపదే పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తరపున, ఇండిపెండెంటుగా, 1998లో బీజేపీ టికెట్టు మీదా, తన స్వంత పార్టీ తరపునా కూడా గెలిచాడు. ఇంత రాజకీయ దిగ్గజం కూడా ప్రపుల్ల పటేల్ పరిపాలనాధికారిగా వచ్చాక నిలబడలేకపోయడు. “నన్ను వెంటాడుతున్నాడు, వేధిస్తున్నాడు, అవమానిస్తున్నాడు” అంటూ పార్లమెంటులోనే మొరపెట్టుకున్నా దిక్కులేకపోయింది. చివరికి ఏమయ్యిందో ఏమో మొన్న ఫిబ్రవరి 22, 2021న 15 పేజీల లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో ఈ ప్రపుల్ల పటేల్ పేరునే ప్రముఖంగా ప్రస్తావించాడట! అయినా ఎవరికి పట్టింది? అతనొక ఆదివాసీ ఎంపీ, అతను రాజు కాదు, రెడ్డి కాదు, పటేల్ అంతకంటే కాదు ఆఘమేఘాలమీద వ్యవస్థలన్నీ స్పందించడానికి. ప్రజలకు మాత్రం తీరికెక్కడిది ఇలాంటోళ్ళ రోదన వినడానికి.

వీడిని పరిపాలనాధికారిగా తప్పించడానికి బదులు లక్షదీవులకు కూడా వీడినే నియమించారు.

savelakshadweepfrombjp

savelakshwadeep

Lakshadweep