అభివృద్ధికి ఆమడ దూరం కొండపి నియోజకవర్గం..

0
40

అభివృద్ధికి ఆమడ దూరం కొండపి నియోజకవర్గం..
ప్రతిపక్ష నియోజకవర్గం పై వైసిపి వివక్ష
సింగరాయకొండ,జూన్ 1,మాస్టర్ న్యూస్ ప్రతినిధి (పెట్లూరి వెంకటేశ్వర రావు)
ప్రతి పక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో ప్రభుత్వ వివక్షత కారణంగా నే ఆభి వృద్ది ఆమడ దూరంలో ఉందని కొండపి శాసన సభ్యుడు టిడిపి రాష్ట్ర నాయకుడు డా.డోలా బాల వీరాంజనేయ స్వామి దుయ్యబట్టారు.ఆయన మంగళవారం కొండపి లోని తమ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన వైసిపి రెండు సంవత్సరాల పాలన పై ఆయన విరుచుకు పడ్డాడు. ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఆమడ దూరం లోనే వుంది మా ప్రభుత్వం లో 52 కోట్ల రూపాయల తో 22 గ్రామాలకు మంజూరైన రోడ్లు రెందెళ్లైనా ఒక్కటి కూడ వేయలేకపోయారని ఆయన విమర్శించారు. నియోజక వర్గ కేంద్రమైన కొండేపి లో 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అంబేడ్కర్ భవనం అలాగే ఆగిపోయిందని రెండేళ్లలో ఒక్క ఇటుక ముక్క కూడా పెట్టలేదు అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సింగరాయకొండ లో షాదీఖానా నిర్మాణానికి 30 లక్షలతో మంజూరయిందని టెండర్లు పూర్తయిబా దానికి అతీగతీ లేదు అని దుయ్యబట్టారు. పాకల బీచ్ లో 4.5 టూరిజం నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ రెండు సంవత్సరాలుగా అది ఆగి పోయిందన్నారు. కొండపి పొదిలి రోడ్ కి కందుకూరు కనిగిరి రోడ్లకు నిధులు మంజూరు చేస్తే రోడ్లు వేయడానికి ఇంతవరకు చేతులు రాలేదన్నారు. సంగ మేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు పాలేరు మీద 13 కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అదనపు నిధులు తేవడం లో వైఫల్యం చెందారు అని స్వామి విమర్శించారు. పురోగతి సింగరాయకొండ గురుకుల పాటశాల లో 100 సీట్లు సైన్స్ కోర్సు లో రద్దు చేశారు ఇదేనా ప్రగతి పేదల సంక్షేమం అంటే అని ప్రశ్నించారు.నాడు నేడు అని గొప్పలు చెప్పుకుంటూ సింగరాయకొండ గురుకుల పాటశాల లో పాత అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని కూల్చి మొండి గోడలు మిగిల్చారు అభివృద్ది అంటే ఇదేనా? అంబేడ్కర్ స్టడీ సర్కిల్ రద్దు చేయడం బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేయడం విదేశీ విద్యాధరణ పథకం రద్దు చేయడం ప్రైవేట్ కాలేజెస్ లో పీజీ చదివే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రద్దు చేయడం వైసిపి భాష లో సంక్షేమమా అని నిలదీశారు. మత్స్యకార భరోసా లో రైతు భరోసా లో లబ్ధిదారులను తగ్గించడమేనా సంక్షేమమంటే కంది రైతులకు నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయారాన్నారు. సంక్షేమ మంటే ఉపాధి హామీ పథకంలో అక్రమలే అభివృద్దా లిక్కర్ ,ఇసుక, మట్టి మాఫియాలకు అంతే లేదని,అభివృద్దిగురించి మాట్లాడే హక్కు వై.సి.పి. వారికెక్కడిదని బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు.టి.డి.పి.హయాంలో పేదలు ఇల్లు నిర్మించుకుంటే ఇంతవరకు వారికి బిల్లులు చెల్లించలేదని అభివృద్ధి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.టి.డి.పి.ప్రభుత్వం హయాంలో రోడ్లు వేస్తే ఇంతవరకు వారికి బిల్లులు చెల్లించలేదని స్వామి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తుచర్యలు తీసుకోనందుకే అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఇవన్నీ ప్రభుత్వహత్యలేనని అన్నారు.ఇదంతా ప్రభుత్వం చేతకానితనంగా స్వామి అభివర్ణించారు.