చంద్రబాబు పై మంత్రి అనిల్ ద్వజo —-ఆయన జూమ్ పార్టీ అధ్యక్షుడాని ఎద్దేవా

0
14

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన నెల్లూరులోని వైసీపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జూమ్‌ పార్టీ అధ్యక్షుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఆలస్యానికి చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం పోలవరం, వెలుగొండ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. 

‘ఆపద్ధకాలాలలో సలహాలు ఇవ్వడం మానేసి హైదరాబాద్‌లో కూర్చున్నారు. స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని’ మంత్రి ధ్వజమెత్తారు. పక్కరాష్ట్రంలో ఉంటూ తండ్రీకొడుకులు చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ఈ రెండేళ్లలో ఏనాడైనా ప్రజల కోసం బాబు ఏపీకి వచ్చారా ? అని సూటిగా ప్రశ్నించారు. ఎల్లో ఫంగస్‌ కంటే ఎల్లోమీడియా ప్రమాదకరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేక ప్రతిపక్ష నేతలు ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్న టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమిని మంత్రి అనీల్ చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకం ఆగకుండా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి నిలుస్తున్నారని వెల్లడించారు.