ఒక మందు శాస్త్రీయ నిరూపణ చేశాకే ప్రజలకు పంపిణీ చేయాలి అనే గొప్ప విషయం అల్లోపతికి వర్తించదా..!

0
11

జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి

ఒక మందు శాస్త్రీయ నిరూపణ చేశాకే ప్రజలకు పంపిణీ చేయాలి అనే గొప్ప విషయం అల్లోపతికి వర్తించదా..! డయాబెటిస్ లాంటి జీవనశైలి వ్యాధులకు అల్లోపతిలో ఇస్తున్న వైద్యం చేతబడి, రంగురాళ్ళ కంటే హీనమైనది అయితే దానిపై మీరు ఎందుకు పోరాడటం లేదు..?
ఈ ప్రపంచంలో గత వంద సంవత్సరాల లో అల్లోపతి మందులతో డయాబెటిస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే మీకు రెండు కోట్లు బహుమతి ఇస్తాను. అలాగే మీకు తెలిసిన వంద మంది డయాబెటిస్ వారిని నా దగ్గరకు పంపండి. అందులో ఒక్కడికి తగ్గకపోయినా నేను తప్పు అని ఒప్పుకొని రెండు కోట్లు మీకు బహుమతి ఇచ్చి, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటాను. భూమిలో ఒక్కడికీ రోగం తగ్గించలేని మందులు ప్రపంచం అంతటా ప్రోటోకాల్ ఎలా అయ్యాయో, అందులో మాయాజాలం ఏమిటో మీరే చెప్పాలి.. వాటి గురించి మీ ప్రజా గొంతులు మూగపోతాయి ఎందుకో మరి..!

అల్లోపతి మాత్రమే ప్రపంచంలో అతి పెద్ద సైన్స్ అనేది నిర్వివాదాంశం.. కానీ అదేమీ అన్నింటిలో తోపు కాదు.. ముఖ్యంగా అందులో జీవనశైలి వ్యాధుల చికిత్స పేరిట దూరిన మందుల కంపెనీలు ఇరికించిన తప్పుడు గైడ్ లైన్స్ కారణంగా కోట్ల మంది బలి అయ్యారు.. ఇప్పటికీ బలి అవుతూనే ఉన్నారు.. డయాబెటిస్ చేస్తున్న విధ్వంసం తో పోలిస్తే కరోనా పిపీలకం.. కరోనా మరణాలలో కూడా డయాబెటిస్ దే సింహ భాగం..

మీకు ఒక సూటి ప్రశ్న. భూమి పుట్టాక ఒక్కడికీ డయాబెటిస్ రివర్స్ చేయలేని అశాస్త్రీయ అల్లోపతి మందులు నిషేదించమని మీరు ఎప్పుడయినా పోరాడారా..??
సింపుల్ గా ఆహారం తీసుకొనే విధానాలు మార్పు ద్వారా మొదటిరోజే మందులు మురుగ్గుంటలో పారేసి డయాబెటిస్ ను తరిమి కొట్టిన రిపోర్టులు మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను.
ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత ఉందో లేదో నాకు తెలియదు. కాలం తేలుస్తుంది..
ఆనందయ్య గారు అల్లోపతి ని ఛాలెంజ్ చేయలేదు.. కానీ నేను డయాబెటిస్ కు మందులు వాడటం గురించి అల్లోపతి గైడ్ లైన్స్ మీద తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నాను. బహిరంగ సవాల్ విసురుతున్నాను.. వాళ్ళు ముందుకు రావటం లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు..
నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ హేతువాద సంఘాలు, జన ఆజ్ఞాన వేదికలు (కొన్ని సంఘాలు), ప్రతి దాంట్లో దూరే గోగినేని బాబు గారి లాంటి అశాస్త్రీయ సమర్ధకులు నా ఛాలెంజ్ ఎందుకు స్వీకరించటం లేదు..?

ఆనందయ్య గారి నాటు మందు అల్లోపతి మందుల వ్యాపారానికి ఎక్కడ గండి కొడుతుందో అని భయపడే మీ ప్రజా సంఘాలు అదే అల్లోపతి డయాబెటిస్ మందులపై తీవ్ర పోరాటం చేస్తున్న నా మీద కూడా అలాగే ముందుకు రావాలి అని మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాను.

ఒక మందు అల్లోపతినా, ఆయుర్వేదమా, నాటుమందా, ఆహార విధానమో ప్రజలకు అవసరం లేదు. మాకు కావలసింది రోగం తగ్గటం, సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవటం మాత్రమే..

సైన్స్ రెండు రకాలు.. ఒకటి నిజం సైన్స్.. రెండోది సైన్సు ముసుగులో దాక్కున్న దొంగ సైన్స్.. ఈ రెండూ ఒకటి కాదు.. మీరు రెండిటినీ కలిపి సమర్ధిస్తున్నారు..!

ఒక వాక్సిన్ ఒకరికి 150 కు ఇస్తారు, అదే వాక్సిన్ మరి కొందరికి 1200 కు అమ్ముతారు.. 150 లోనే లాభాలు ఉంటాయి..ఇక 1200 అమ్మకంలో ఎంత మిగులుతుందో ఊహించండి.. పైగా పుట్టని శిశువు నుంచి కాసేపట్లో పోయేవాడికి కూడా భయపెట్టి మరీ మల్టిపుల్ డోసులు వేయించబోతున్నాం.. అంటే వందల కోట్ల డోసులు x వెయ్యి రూపాయల ప్రాఫిట్.. అది కూడా కేవలం ఒకటి రెండు కంపెనీలకు మాత్రమే సుమా..! ఇక బ్లాకు మార్కెట్ గాళ్ళ పండగల గురించి వేరే లెక్క.. నిజానికి రెమెడిసివర్ లాంటి మందు MRP షుమారు 3000 ఉంటే (అందులోనే 80% ప్రాఫిట్ మినిమం) బ్లాకులో ఎంతకు అమ్మామో తెలుసు కదా..
రోజుకు లక్ష బిల్లు వేసి జనాన్ని దోచుకున్న కొన్ని (అందరూ కాదు) కార్పోరేట్ హాస్పిటల్స్ మీద మీలాంటి ప్రజా సేవకులు పోరాడతారు అని మాలాంటి వాళ్ళు భావిస్తుంటే పోయి పోయి అమాయకుడు, ఏదో తనకు తెలిసిన మంచిని సొంతడబ్బులతో పంచుదామనుకున్న ఆనందయ్య మీద పడ్డారు.. ఆయన మీద పెట్టే కాన్సంట్రేషన్ లో వందో వంతు పైన జరుగుతున్న దోపిడీ ల మీద పెట్టి ప్రజలకు మేలు చేయండి సార్..!

హైడ్రాక్సీ క్లోరోక్విన్లు, ఫావిఫెరావిర్లు, ప్లాస్మా ధెరఫీలు, రెమెడిసివర్లు పని చేయవు అని తేలిపోయింది.. ఇక నికరంగా మిగిలింది జింకు సప్లిమెంట్లు, ఐరన్ టాబ్లెట్, విటమిన్/మినరల్ టాబ్లెట్లు పారాసెటమాల్ మాత్రమే.. అంటే నాలాంటోళ్ళు చెప్పే ఇమ్యూనిటీ ఫుడ్డు మాత్రమే మిగిలింది నికరంగా..

ఒక హేతువాది చెప్తాడు నాలుగు సార్లు నోబుల్ కు నామినేట్ అయిన వైరాలజిస్ట్ చెప్తే మేము వినము నోబుల్ వచ్చినోడు చెప్తే మాత్రమే వింటాము అని.. ఈ నోబుల్ గ్రహీతలు, కోట్ల డాలర్ల మందుల కంపెనీలు, సైన్స్ ప్రతినిధులు ఇంత వరకు ఒక్క పరిష్కారం ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి.. ఈ నోబుల్ గ్రహీతలు ఇంతవరకూ జలుబు, షుగరు, బిపి, కాన్సరు, వైరస్ లు, ఆటో ఇమ్యూన్ రోగాలు వేటికీ మందు కనిపెట్టలేదు.. కనిపెట్టిన వాటిని ఎలా తొక్కేస్తారో చరిత్ర వివరంగా చెప్తుంది..

ప్రజలకు మంచి చేయాలన్న మీ సంకల్పం గొప్పది.. కానీ ఆచరణలో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తోంది.

నా అభిప్రాయాలతో మీరు విభేదించినట్లయితే మీ టీమ్ తో మీడియాలో బహిరంగ చర్చకు సిద్దం కండి.. నేను నా టీమ్ రడీ గా ఉన్నాము.. అన్ని విషయాలు ప్రజల సమక్షంలో వివరంగా చర్చిద్దాం.. మీ వాదన సబబుగా ఉంటే నా విధానం మార్చుకోవటానికి నేను సిద్దం.. ప్రజల మేలు కోసం ముందుకొస్తారని ఆశిస్తున్నాను..

భవదీయుడు
వీరమాచనేని రామకృష్ణ
వాట్సప్ నెంబర్ 9246472677