కరోన పోర్త్ వేవ్ భయపడుతున్న ప్రజలు

0
14

సినిమాలకు సీక్వెల్స్ ఏమో గానీ ఈ కరోనా వైరస్ కి మాత్రం మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ అంటూ ఒకదాని తర్వాత ఒకటి అడక్కుండానే రెడీ అయి వచ్చేస్తున్నాయి. ఈ సీక్వెల్స్ చైనా చైన్ ఎప్పుడు ఆగుతుందా అంటూ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తుండగా ఈ మహమ్మారి మాత్రం ఏ కొంచెం జాలి చూపడం లేదు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ముంచెత్తుతోంది. ఎక్కడ చూసినా కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరోనా పేషెంట్ల మరణ మృదంగం రోజుకి వేలల్లో నమోదు అవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే జపాన్ లో ఫోర్త్ వేవ్ నాలుగో దశ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే అక్కడ థర్డ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఇప్పుడీ ఫోర్త్ వేవ్ వినికిడి మరింత కలవరపెడుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగకపోవడమే ఈ విధ్వంసానికి కారణం అంటున్నారు నిపుణులు. 12.5 కోట్ల వరకు జనాభా ఉన్న జపాన్ దేశంలో దాదాపు 3 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. రోజూ రోజుకి పరిస్థితి చేయిదాటి పోతోందని అక్కడి నిపుణులు భయపడుతున్నారు. మరోవైపు జపాన్ లో సంభవిస్తున్న కరోనా మరణాలలో 25 శాతం మరణాలు ఒసాకా నగరంలోనే నమోదు అవుతుండడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరోవైపు ఒలంపిక్స్ మొదలు కాబోతుంది అనే వార్త ఒసాకా నగరాన్ని మరింత వణికిస్తోంది.

వైరస్ ఉధృతి మరింత పెరుగుతుందేమోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒలంపిక్స్ ప్రారంభమయ్యేటప్పటికి ఒలంపిక్స్ క్రీడా గ్రామాల్లో 80 శాతం వరకు వ్యాక్సినేషన్ అందిస్తామని ఐ ఓ సి ప్రకటించి హామీ ఇచ్చింది. అన్నట్లుగానే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. కానీ మరోవైపు ప్రజలు మాత్రం ఈ కరోనా భయాన్ని వీడలేకపోతున్నారు. ఈ మహమ్మారి వైరస్ ఎప్పుడు మన బతుకుల్లో నుండి మాయం అవుతుందో అర్థం కావడంలేదు.