దళితులపై దాడి చేసిన ఆధిపత్య కులదురహంకారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..

0
906

దళితులపై దాడి చేసిన ఆధిపత్య కులదురహంకారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..
దళితులకు మెరుగైన వైద్యం అందించాలి…
దళితులకు రక్షణ కల్పించాలి…

అండ్ర మాల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం లోని నక్కనదొడ్డి గ్రామ BC కులానికి చెందిన బోయ లింగమయ్య మరియు అతని కుమారులు సురేష్ , వెంకటేష్, శ్రీనివాసులు కలసి దళిత కులానికి చెందిన బి లక్ష్మీదేవి W/O బి మస్తానయ్య (లేట్) పై 24/4/21 శనివారం న దారుణంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు . ఆడమనిషి లక్ష్మిదేవి మరియు వారి పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసిన ఆధిపత్య కులదురహంకారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. వివరాలు:గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి ఇంటివద్ద గల ప్రభుత్వ భూమిలో బిసి కులానికి చెందిన లింగమయ్య కుటుంబం దొడ్డి ఏర్పాటు చేసుకున్నారు. వారి దొడ్డికి వెళ్లేందుకు దారి వేరొక చోటు నుండి ఉన్నా కేవలం లక్ష్మీదేవి కుటుంబం మీద కుల అహంకారంతో దౌర్జన్యంగా లక్ష్మీదేవి ఇంటి పక్కనే దారి ఏర్పాటు చేసుకుని దౌర్జన్యంగా తిరగడం జరుగుతుంది. ఈ విషయం పై లింగమయ్యను అతని కుమారులను, ఎన్నోసార్లు హెచ్చరించినా వినకుండా కావాలనే గొడవపడి మొండిగా దారి ఏర్పాటు చేసి తిరుగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండేవారు... ఈ క్రమంలో శనివారం 24/04/2021 తేదీన సుమారు 10 గంటల సమయంలో బోయ లింగమయ్య మరియు అతని కుమారులు ముగ్గురు కలిసి " మా దొడ్డికి దారి ఉంది. మేము సిమెంటు రోడ్డు వేపించాలి. మీ ఇటుకలు ,కట్టెలు తీసేయండి" అని బెదిరించారు. ఓ ప్రక్క వారితో మాట్లాడుతుండగానే లక్ష్మీదేవి ఇంటి వద్దకు JCB తీసుకుని వెళ్లి వారి స్థలంలో ఉన్న సిమెంట్ ఇటుకలు, ఎండు కట్టెలు మరియు సైజు రాళ్లుని జెసీబితో పెకిలించారు. లక్ష్మీదేవి ఇంటిగోడని పగులగొట్టడానికి ప్రయత్నం చేయడంతో అడ్డు చెప్పబోయిన లక్ష్మీదేవిని బోయ లింగమయ్య, అతని కుమారులు సురేష్, వెంకటేష్, శ్రీనివాసులు కలిసి కులం పేరుతో దూషించి పెద్ద పెద్ద బండ రాళ్లతో, కట్టెలతో దాడి చేస్తూ కింద పడేసి కాళ్లతో తన్నుకుంటూ " మాదిగదాన మాకే అడ్డు వస్తావా...? నీ ఇల్లు పడేస్తాం...! నీకొడుకులను చంపేస్తామ్...! నువ్వు ఈ వూర్లో ఎలా బతుకుతావొ చూస్తాం... ! " దాడులు చేశారు. బిగ్గరగా కేకలు వేస్తూ గ్రామంలోని వారందరినీ భయభ్రాంతులకు చేశారు. దెబ్బలు తిన్నా లక్ష్మిదేవి గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడం జరిగింది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకి పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాదిత మహిళతో స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది.

SC/ST అట్రాసిటి కేసు నమోదు చేయాలని బాధిత మహిళ తరపు బందువులు కోరడంతో DSP గారు బాదిత మహిళ లక్ష్మీదేవిని, ఆమె కుమారులని ఇద్దరిని DSP Office కి పిలిపించుకొని విచారించి, వారి వద్ద వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగినది…
కులం పేరుతో దూషించి దారుణంగా దాడి చేసిన ఆధిపత్య కులదురహంకారులైన బోయ లింగమయ్య అతని కుమారులు సురేష్, వెంకటేష్ , శ్రీనివాసులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. దళిత మహిళ లక్ష్మిదేవి కి మెరుగైన వైద్యం అందించాలి. వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాము. ప్రభుత్వ భూమిలో ఉన్న లింగమయ్య దొడ్డని తొలగించి ఇల్లు లేని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు….
అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి