దళిత కౌలు రైతు అప్పారావు పై దాడి చేసిన యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు మరియు అనుచరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి కేవీపీయస్ డిమాండ్.

0
86


దళిత కౌలు రైతు అప్పారావు పై దాడి చేసిన యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు మరియు అనుచరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని , దళితులకు రక్షణ కల్పించాలని కోరుట గురించి….
నమస్కారం సార్….
విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు మరియు అనుచరులపై ఎస్ సి , ఎస్ టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మీకు లేఖ ద్వారా తెలియపరుస్తున్నాను. మా సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు మద్దెల సుబ్బన్న , సీనియర్ నాయకులు బాలకృష్ణ లు బాధితులను పరామర్శించారు. వారు అందించిన వివరాలు మీకు లేఖ ద్వారా తెలియపరుస్తున్నాను ….. 17-4-2021శనివారం రాత్రి 11 గంటలకు దళిత కౌలు రైతు భూపతి అప్పారావు కౌలుకు తీసుకున్న జీడి తోటల వద్ద వుండగా యలమంచిలి ఎంఎల్ఏ కన్నబాబు రాజు గారి అనుచరులు మారణాయుధాలతో భూపతి అప్పారావు పై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. ఈ దాడిలో అప్పారావు ఎడమ కాలు, కుడి చెయ్యి విరిగింది. తలపై రాడ్ తో బలంగా కొట్టడం వల్ల పెద్ద గాయం అయింది. 7 కుట్లు పడ్డాయి.
17 న అర్థరాత్రి యలమంచిలి ఆసుపత్రికి అక్కడ నుంచి అనకాపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
2020 డిసెంబర్ లో శ్రీనివాస్ రాజు గారి 15 ఎకరాల జీడి తోటను దళిత కౌలు రైతు భూపతి అప్పారావు రెండు సంవత్సరాలకు కౌలుకు తీసుకున్నాడు. 2021 జనవరిలో ప్రక్క గ్రామానికి చెందిన ఎంఎల్ఏ కన్నబాబు రాజు అనుచరులు కౌలు రద్దు చేసుకొని జీడి తోటలను వారికి అప్ప చెప్పాలన్నారు. అప్పారావు ఒప్పుకోక పోవడంతో మారణాయుధాలతో దాడి చేసి కొట్టారు. స్ధానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా నమోదు చెయ్యలేదు. పోలీస్ స్టేషన్ దగ్గరే అప్పారావు భార్య తీవ్రమైన బాధతో, ఆవేదనతో పోలీసులను వేడుకున్న కనీసం కనికరం చూపించలేదు. ఏఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యలేదు. విషయం తెలుసుకున్న మా సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు కె సుబ్బన్న మరియు సీనియర్ నాయకులు బాలకృష్ణ లు పరామర్శించారు. పోలీసు స్టేషనుకు వెళ్లి మాట్లాడితే కానీ పోలీసులు ఏఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యలేదు .
యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు గారు కూడా అప్పారావుకు ఫోన్ చేసి బెదిరించాడు. అయినా దళిత కౌలు రైతు భూపతి అప్పారావు కూడా లెక్క చేయకుండా వుండడంతో ఆగ్రహించిన MLA అనుచరులు దాడి చేశారు. ఈ దుర్మార్గాన్ని కెవీపియస్ రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన కులవివక్ష, దాడులు, అవమానాలు, హత్యలు, శిరోముండనాలు పెరిగిపోతున్నాయి. పాలకులు మరియు అధికారులు నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. అత్యాచారాలకు పాల్పడిన వారిని కాపాడుతున్నారు. బాధితులకు రక్షణ కల్పించడంలో దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నారు. కౌంటర్ కేసులు పెడుతున్నారు. రాజీలు చేసుకొమని పోలీసులే బాధితులపై ఒత్తిడి చేస్తున్నారు. రెండు కేసులు నమోదు చెస్తామంటున్నారు. ఉదాహరణకు నెల్లూరు రూరల్ మండలంలో రమణ అనే దళిత యువకుడు పై అధికార ఆధిపత్య పెత్తందార్లు కులం పేరుతో దూషించి దాడి చేస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు రమణే ముద్దాయిలను కొట్టినట్లు కౌంటర్ కేసు పెట్టి రాజీ చేసుకోమని వత్తిడి చేశారు. తలొగ్గకపోయేసరికి సరైన సాక్ష్యాలు లేవని కేసు ఫాల్స్ చేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని లంకెలకూరపాడు లో ఓటు వెయ్యడానికి వచ్చిన దళిత మహిళ వద్ద బలవంతంగా లాక్కోని ఓటు వేసిన అధికారపక్షం నాయకులను భర్త సుందరయ్య అడిగినందుకు కులం పేరుతో దూషించి దాడి చేశారు. కేసు నమోదు అయింది. ఇంతవరకు ముద్దాయిలను అరెస్టు చెయ్యలేదు.
రాష్ట్రంలో ఇంకా అనేక దుర్మార్గమైన ఘటనలు జరుగుతున్నాయి. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని, దళిత కౌలు రైతు భూపతి అప్పారావు ను కులం పేరుతో దూషించి దారుణంగా దాడి చేసిన యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు మరియు అనుచరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని , దళితులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాము….
కాఫీ టు….
గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు
హోం శాఖామాత్యులు , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
గౌరవనీయులు శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు
డిఐజి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
గౌరవనీయులు శ్రీమతి రత్న ఐపీఎస్ గారు,
ఇట్లు
అండ్ర మాల్యాద్రి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్)
సెల్:9490300366