Uncategorized

తడిగడప పురపాలక సంఘం ఆఫీస్ లో కాంగ్రేస్ నాయకులు పాలకీర్తి రవి,యన్ వరప్రసాద్
గాంధీజీ విగ్రహనికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు .

తడిగడప పురపాలక సంఘం ఆఫీస్ లో కాంగ్రేస్ నాయకులు పాలకీర్తి రవి,వరప్రసాద్
గాంధీజీ విగ్రహనికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు .మాట్లాడుతూ ఈ విధంగా తెలిపారు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కుల, మతతత్వ రాజకీయాలతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నదనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు.
బాధ్యతాయుతమైన పార్టీలో సభ్యులుగా వున్న మనమందరం మొదటినుంచీ బిజెపి ప్రభుత్వం యొక్కకుటిల రాజకీయ ఎత్తుగడలను ప్రజల ముందుంచుతూ ప్రజా క్షేత్రంలో బిజెపి దిగజారుడుతనాన్ని
బట్టబయలు చేస్తూనే వున్నామని, దేశాన్ని, దేశ సంపదను అమ్మకానికి పెడుతూ రాజకీయ మనుగడను కాపాడుకోవడానికి బిజెపి ప్రభుత్వం చేయని కుతంత్రాలు లేవన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు నిజాలు తెలియకుండా మతం పేరిట మారణహమాలు సృష్టిస్తున్నారన్నారు. పై కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నందిగామ వరప్రసాద్ ,నున్న నాగరాజు ,అనిల్,పవన్, సురేష్, తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here