Uncategorized

కర్నూలు జిల్లా వెలుగోడులో జంట (ఇద్దరి దారుణ) హత్య

కర్నూలు జిల్లా వెలుగోడులో జంట (ఇద్దరి దారుణ) హత్య :
చందా ఓబులేసు పిట్ల చిన్ని : మృతదేహాలు : సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న సీఐ బి ఆర్ కృష్ణయ్య, ఎస్సై పీరయ్య యాదవ్ :
వెలుగోడు మండల కేంద్రం సి పి నగర్ ప్రాంతంలో జంట (ఇద్దరు ఒకఆడ – ఒకమగ వ్యక్తులు దారుణ) హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన పీట్ల రమణయ్య అనే వ్యక్తి తన మొదటి కొడుకు మల్లికార్జున రెండో భార్య పీట్ల చిన్ని 24 సం.. అనే మహిళ (కోడలు) ను, చందా ఓబులేసు 25 సం.. ల పెళ్లి కానీ యువకుడిని శుక్రవారం అర్ధరాత్రి గొడ్డలితో ఇద్దరి తలలపై నరికి (చంపినాడు) హతమార్చాడు. అదే సమయంలో వెలుగోడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి లొంగిపోయాడు. అదే రాత్రి కార్డెన్ సెర్చ్ లో ఉన్న ఎస్సై పీరయ్య యాదవ్ ఆత్మకూరు పాములపాడు ఎస్ఐ లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఆత్మకూరు సిఐ బి ఆర్ కృష్ణయ్య కు మృతురాలి భర్త పీట్ల మల్లికార్జున తెలిపిన వాయిస్ :
శనివారం ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన పీట్ల మల్లికార్జున కు సిద్దాపురం గ్రామానికి చెందిన పిట్ల రవణమ్మ తో మొదటి వివాహం జరిగిందని వీరికి నలుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉందని తెలిపాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న :
నెల్లూరు జిల్లా కప్పరాళ్ళ తిప్ప మండలం బీట్లా గ్రామానికి చెందిన పీట్ల చిన్ని అనే ఆమెను గత ఆరు సంవత్సరాల క్రితం ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడని వీరికి ఒక బాబు ఉన్నాడు అని తెలిపాడు.
శుక్రవారం సొంత పనుల నిమిత్తం మల్లికార్జున సిద్దాపురం గ్రామానికి వెళ్ళడు. కోవెలకుంట్ల కు చెందిన చందా ఓబులేసు గత కొంత కాలంగా తాపీ పని చేసుకుంటూ తన భార్య తన తండ్రి వద్ద నే చేదోడు వాదోడు గానే వుంటూ తన కుటుంబంలోని ఒక వ్యక్తి గా ఉంటున్నాడని అన్నాడు.

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేసిన మామ. : : పిట్ల మల్లికార్జున తండ్రి పీట్ల రమణయ్య తన కోడలు రెండవ కోడలు అయినటువంటి పీట్ల చిన్ని, చందా ఓబులేసు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరిని హతమార్చినట్లు మృతురాలి భర్త తెలిపాడు. మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

సంఘటనా స్థలానికి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి ఆత్మకూరు ఇన్చార్జ్ రామాంజ నాయక్, ఆత్మకూరు సిఐ బి ఆర్ కృష్ణయ్య, వెలుగోడు ఎస్సై చిన్న పీరయ్య యాదవ్ జరిగిన హత్యలపై పలు కోణాలలో ఇంకా వివరాలు సేకరిస్తున్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here