Uncategorized

తలకోన వద్ద 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒక స్మగ్లర్ అరెస్ట్

తలకోన పరిధిలోని కొక్కిరాయి కనుమ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలు మేరకు డీఎస్పీ మురళీధర్, ఆర్ ఐ సురేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆర్ ఎస్ ఐ లింగాధర్, డీఆర్వో నరసింహారావు బృందం నెరబైలు సెక్షన్, తలకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కొక్కిరాయి కనుమ వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా, దుంగలతో పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ వారిని వదలకుండా వెంబడించింది. దీంతో దుంగలను పడేసి పొదల్లో కలిసిపోయారు. అయితే వారిలో ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. ఇతను తమిళనాడు వేలూరు సమీపంలో ని తొంగమలై కు చెందిన శంకర్ గోవిందన్ (36)గా గుర్తించారు. ఇతనిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. దీనిపై ఎస్పీ సుందరరావు మాట్లాడుతూ ఈ 18 దుంగలు 571 కిలోలు ఉన్నాయని, వీటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. సాహసం తో దట్టమైన అడవిలో కూంబింగ్ చేపట్టి దుంగలను, స్మగ్లర్ ను పట్టుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. సి ఐ వెంకట రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సి ఐలు వెంకట్ రవి, చంద్రశేఖర్, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ లింగాధర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, డీఆర్వో పివి. నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here