Uncategorized

నంద్యాల పార్లమెంట్, కల్లూరు
27న భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దత్తు
వైసీపీ , టిడిపి లు బిజెపి తో గల్లి లో కుస్తీ ఢిల్లీ లో దోస్తీ
జె.లక్ష్మీ నరసింహ యాదవ్

నంద్యాల పార్లమెంట్, కల్లూరు
27న భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దత్తు
వైసీపీ , టిడిపి లు బిజెపి తో గల్లి లో కుస్తీ ఢిల్లీ లో దోస్తీ
జె.లక్ష్మీ నరసింహ యాదవ్
డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా.
వ్యవసాయ అనుబంధ బిల్లులు అయిన రైతులకు వ్యతిరేకంగా
బిజెపి ఆటకు వైసిపి. టీడీపీ తందాన. అంటూ రైతుకు ద్రోహం చేస్తున్నాయి.
బిజెపి ప్రభుత్వం తెస్తున్న ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ వైకాపా ఎంపీల రాజీనామా చేయాలి.
కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జై లక్ష్మీ నరసింహ యాదవ్
కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత మూడు బిల్లులు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డి సి సి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆరోపించారు. గురువారం నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27 వ తేదీ న జరగబోయే భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని ఈ మేరకు నంద్యాల పార్లమెంట్ పరిధి లో అన్ని బంద్ నిర్వహిస్తామని తెలిపారు, ఈ వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో చిక్కుకుని ఏ అవకాశం ఉండదన్నారు ఇప్పటికే ఉచిత విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వివాద స్పదంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు రైతులకు భవిష్యత్తులో భారం అయ్యే అవకాశం ఉండగా మళ్లీ వ్యవసాయ అనుబంధ బిల్లులో రైతుల ఉసురుతీసే విధంగా మారే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటివరకు మార్కెట్ యార్డ్లో కు వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిపే వారు ఇకపై మార్కెట్ యార్డులో కాక బయట కూడా స్వేచ్ఛగా విక్రయించే సదుపాయం కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన వ్యాపారులు తమ ఇష్టం వచ్చిన ధరలకు వారి ఉత్పత్తులను కొనేలా పీడించే అవకాశం ఉందన్నారు.
రెండో బిల్లు పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం పై రైతుకు. వ్యాపారులకు మధ్య చేసుకున్న ఒప్పందానికి రక్షణ కల్పించడం. పంట వేసుకునే ముందు ఉత్పత్తుల చౌకగా ఒప్పందం చేసుకొని రైతులను మోసం చేసే అవకాశం ఉంది . ఆ ఒప్పందం చట్టబద్ధం అయితే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది.
సహకార బ్యాంకుల పై పర్యవేక్షణ అధికారం పెట్టడం మూడో బిల్లు. ఇప్పటి వరకూ కోపరేటివ్ రంగంలో ఉన్నా ఈ బ్యాంకులో ఆర్బిఐ ఆధ్వర్యంలో కి వెళ్తే రైతులపై అనేక చార్జీలు వేసి రుణాన్ని మరింత భారం చేసే అవకాశం ఉందన్నారు . పల్లెల్లో తేలిక రైతులు ఈ బ్యాంకులో పైన ఆధారపడి రుణాలు పొందుతున్నారు.
ఇప్పటికే ఆత్మహత్యల్లో రాష్ట్రము దేశము అతలాకుతలం అవుతుంటే ఈ బిల్లులతో వారిని మరింత అప్పుల ఊబిలోకి దింపి ఆత్మహత్యల వైపు పయనించేలా ప్రభుత్వం తీసుకు వెళ్తున్నదిని ఆరోపించారు. వ్యవసాయం కూడా కార్పొరేట్ మయం చేసి దేశ ప్రజలకు తిండి ని కూడా దూరం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి రైతులకు నష్టం కలిగించే బిల్లులను ఉపసంహరించుకోవాలని లక్ష్మీ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు . పంజాబ్ లాగా ఆంధ్ర ప్రదేశ్ కూడా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కనుక మన రాష్ట్రం భూమి ఎంపీలు ఈ బిల్లుకు నిరసనగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ బిల్లులకు టిడిపి వైసిపి మద్దతు పలికాయి అన్నారు. ఎందుకు మీరు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వారికి మద్దతు పలుకుతున్నారని నిలదీశారు అదేవిధంగా ఉన్న విద్యా విధానం మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అన్నారు సి.ఐ.ఏ బిల్లుకు మద్దతు పలికారని నిన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతు పలికారు నేడు ఈ బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇంకా మీ మధ్య దూరం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజల ముందు బిజెపిని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నాటకం ఆడుతున్నది అనే ఆరోపించారు.
ఇలా ఎన్నాళ్లు రైతు. ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలుపుతూ ప్రజలకు ద్రోహం చేస్తారన్నారు.
విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ముందుకు వచ్చింది మన రాష్ట్రం కదా అని నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు ప్రజావ్యతిరేక బిల్లులకు మాత్రం మద్దతు ఇవ్వడం ఏమిటని వైకాపా ఎంపీలను ప్రశ్నించారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులకు మద్దతివ్వడం మానుకోవాలని వైసిపికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జనార్ధన్ యాదవ్, మద్దిలేటి , భరత్ కుమార్ మోహన్ మురళి సుబ్బరాయుడు రామాంజనేయులు విజయ్ యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here