Uncategorized

పార్టీలో అలజడి ఎంపీ భరత్ వైకారితోనే

రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ చేసిన పని వల్లే ఈ పార్టీలో అలజడి రేగిందని, ఆయన తక్షణం స్పందించి ఈ రచ్చను ఆపాలని పలువురు అన్నారు.

స్థానిక వె జంక్షన్‌లోని ఆనం రోటరీ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్‌ లంక సత్యనారాయణ, తదితరులు మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో వైసిపి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఎంపీ భరత్‌రామ్‌ ఆటలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన సాధించిన ఫలితాలు దేనికి సంకేతమో తెలుసుకోవాలని అన్నారు. వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పార్టీని స్థాపించిన నాటి నుంచి జక్కంపూడి కుటుంబం ఆయన వెంటే నడుస్తోందని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉండగా ఉద్యమాలు, ఆందోళనలు చేసి మాజీ మంత్రి జక్కంపూడి వెంట జైలుకు వెళ్లామని తెలిపారు. తమ త్యాగాల పునాదులపై భవనాన్ని నిర్మిస్తే తరువాత వచ్చిన వారు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, విజయలక్ష్మి, గణేష్‌ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి వైసిపి పురోభివద్ధికి కషి చేస్తున్నారని అన్నారు. ఎంపీగా పర్యటనలు చేసినప్పుడు ఆయా నియోజక వర్గాల ఎంఎల్‌ఎలను పిలవాలనే స్పృహ ఎంపీకి లేదా అని ప్రశ్నించారు.

తమ భుజస్కందాలపై పార్టీని మోస్తుంటే ఆయనకు వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులుగా ఉంటూ పదవులను పొందిన నాయకులు పార్టీ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెండు మూడు రోడ్లు తప్పా మిగిలినవి అన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఎంపీ అమెరికా తరహాలో అభివృద్ధి చేశామని చెప్పడంలో విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు నరవ గోపాలకృష్ణ, కెఎన్‌ఎల్‌ రెడ్డి, వైకెఎస్‌ నరసింహరావు, నక్కెళ్ల బాబూరావు, బూరాడ భవానీ శంకర్‌, బొరుసు శ్రీనివాస్‌, కొళ్లిమళ్ల రఘు, దేవత సుధాకర్‌, బురిడి త్రిమూర్తులు, కోడి కోట, డాక్టర్‌ ఎంవివి సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here