Uncategorized

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

టీడీపీ జాతీయ కార్యాలయంలో నరేగా ఫిర్యాదుల విభాగం ప్రారంభం విజయవాడ,సెప్టెంబర్23:తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,ప్రభుత్వం కుట్ర పూరితంగా నరేగా బిల్లులు నిలిపివేయడంతో కోర్టుచే ముట్టికాయలు తిన్నా అధికారపక్షానికి బుద్ది రాలేదన్నారు. బిల్లులు త్వరిగతిన విడుదల చేయాలని కోర్టు తీర్పునిచ్చినా కొందరు వైసీపీ నాయకుల ఒత్తిడితో బిల్లులను నిలపేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఫిర్యాదుల విభాగం పరిష్కారానికి తోడ్పడుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నరేగాలో పని చేసిన ప్రతి ఒక్కరికి ఆఖరి రూపాయి అందే వరకు ఈ విభాగం పని చేస్తుందని ఎవరు అధైర్యపడ్డవద్దని వడ్డీతో సహా బాధితులకు చేరే వరకు ఈ విభాగం కృషి చేస్తుందని చంద్రబాబు హామీనిచ్చారు. ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ కింది నెంబర్లు నెంబర్లకు సంప్రదించగలరు. 9393540999,9676088463,9440990479 ఈ కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ అశోక్ బాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష్యులు యలమంచలి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురమూర్తి కృష్ణ, మువ్వా లక్ష్మీ సుభాషిణి గుంటూరు, పోతుగంటి పీరయ్య కడప, సత్రం రామకృష్ణుడు కర్నూలు తదితరులు పాల్గొన్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here