Uncategorized

కొడాలి,వంగవీటి వార్ మీడియా సృష్టి…!!* *గుడివాడలో రాధా కాపు నాయకులను కలిస్తే వార్ అంటారా

*కొడాలి,వంగవీటి వార్ మీడియా సృష్టి…!!* *గుడివాడలో రాధా కాపు నాయకులను కలిస్తే వార్ అంటారా..!!* వంగవీటి రాధా కృష్ణ గుడివాడ వెళ్ళాడు.కామన్ గానే కాపు నాయకుల ఇంటికి వెళతాడు.ఇదేమీ చిత్రం కాదు.దీనికే కొడాలి,వంగవీటి వార్ అంటూ కొన్ని మీడియా సంస్థలు హోరెత్తించడం విచిత్రంగా ఉంది.ఇందులో కాస్త నిజం ఉన్నా,మిగిలింది పులిహోర కలపవచ్చు.మొత్తం పులిహోరే అయితే ఇలాగే ఉంటుంది.బెజవాడ,కృష్ణాజిల్లా రాజకీయాలను జాగ్రత్తగా అంచనా వేయాలి,ఏది పడితే అది వూహజనీతమైన కధనాలు ప్రసారం చేస్తే నవ్వుల పాలవుతాము. ఇప్పుడు వంగవీటి రాధ, కొడాలి నాని వార్ కథనం కూడా అలాంటిదే అని చెప్పాలి.అసలు రాధా గుడివాడ వెళ్ళింది వ్యక్తిగతమైన పని మీద,షోరూమ్ ప్రారంభం విషయం మీద వెళ్లారు.అదే సమయంలో వంగవీటి రంగాను అభిమానించే కాపు మిత్రులు ఇంటికి వెళ్లారు.అంతే ఒక ప్రధాన ఛానల్ ల్లో భూగోళం బద్దలు అయినట్టు కథనం వేసేశారు.ఇద్దరు మిత్రులు పని మీద వెళ్లిన ప్రతిసారి కలవాలని లేదు.నాని మంత్రి ఎప్పుడూ గుడివాడలోనే ఉండాలని లేదు.ఇది అలా జరిగిందే తప్ప వంగవీటి రాధా,కొడాలి వేర్వేరు పార్టీల్లో ఉన్నా మిత్రులే.రాధా కృష్ణ గుడివాడ వెళ్ళాడు కదాని లేని కథనం సృష్టించి వేస్తే.మీడియా మసాలా అలా ఉంచితే,కథనం ప్రసారం చేసిన ఛానల్ క్రెడిబుల్టీ కొలాప్స్ అవుతుంది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here