Uncategorized

బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలి.చింత మోహన్

తిరుపతి,
11-9-2021

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ కామెంట్స్.

👉 సోషలిస్టు విధానాలకు తిలోదకాలిచ్చి, దేశ సంపదను కొద్ది మంది పెట్టుబడి దారులకు దోచి పెడుతున్న మోడీ, BJP ప్రభుత్వం.

👉 పారిశ్రామిక వేత్తలు నుంచి లంచాలు తీసుకుని, విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఇస్రో వంటి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టుతున్నారు.

👉 పెట్టుబడిదారీ విధానాలు ఇండియాకు సూటుకాదు.

👉 తిరుపతి విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, శ్రీహరి కోట ఇస్రో, విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని వెంటనే ఆపాలి.

👉 ఏం అసవరం వచ్చిందని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు??

👉 నెహ్రూ, ఇందిరాగాంధీ విధానాలకు తూట్లు పొడుస్తున్న మోడీ, బిజెపి ప్రభుత్వం.

👉 సరళీకృత విధానాలు అతివాద ధోరణిలో వెళ్లుతోంది.

👉 మేధావులు మౌనంగా ఉంటున్నారు. మౌనం వీడి, బయటికి వచ్చి, మాట్లాడాలి.

👉 బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలి.

👉 పెరిగి పెట్రోలు, డీజల్, వంట గ్యాస్, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

👉 రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాడు. దిగులుతో ఉన్నాడు.

👉 భోగి పండుగ లోపు CM దిగిపోవచ్చు.

👉 సినిమా టికెట్లు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమా??

👉 ఎన్నికల విధానంలో మార్పులు అవసరం.

👉 కేంద్రంలో, రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం అవసరం. కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here