Uncategorized

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి … ** కాంగ్రెస్ పార్టీ డిమాండ్
**ఈ నెల 13 న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి … ** కాంగ్రెస్ పార్టీ డిమాండ్
**ఈ నెల 13 న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
————///——————
రాష్ట్రములో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ డిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిసిసి ,డీసీసీ పిలుపు మేరకు ఈ రోజు పత్రిక విలేకర్ల సమావేశము లో మాట్లాడుతూ,
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోను అంటూ 2019 ఎన్నికల ప్రచార సమయంలొ ప్రజలకు హామీఇచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనాడు ఇచ్చిన హామిని పక్కనపట్టి కరోనా కష్టకాలంలో, ప్రజలకు ఉపాధిలేని సమయంలొ “ట్రూ అప్” అంటూ
ప్రజలపై 3669 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన మోపటం దారుణమని,
విద్యుత్ చార్జీల పేరుతో పేదల నుంచి రాష్ట్ర
ప్రభుత్వం డబ్బులు దండుకుంటుంది అని అన్నారు.లాక్ డౌన్ మూలంగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారికి పూట గడవడమే కష్టంగా వున్న వలస కూలీలు, నిరుపేదలు ఇంటి అద్దెలు,కట్టుకోలేక ఉంటే మరల ఈ విద్యుత్ బిల్లు లు ను పెంచడం దారుణమని వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షములో ఈ నెల 13 వ తేదీన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జిల్లా వ్యాపితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డోన్ టౌన్ అద్యక్షులు ఆర్ గోపినాథ రావు, డోన్ మండల అద్యక్షులు వడ్డే రాజశేఖర్,ఉన్నిగొర్ల రామభూపాల్ ,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సలింద్ర లక్ష్మన్న ,లు పాల్గొన్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here