Uncategorized

Photo from Reddy

*తహసీల్దార్లకున్న ఆ అధికారం పోలీసులకు లేదు..*

*ఎస్‌ఐలకు ఉత్తర్వులివ్వండి: ఏపీ హైకోర్టు*

అమరావతి: సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పరశురాములు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అల్లర్లను సృష్టించే వారిని సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద బైండోవర్‌ చేసే అధికారం తహసీల్దార్లకు ఉందని.. వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్‌-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పీఎస్‌ల ఎస్‌ఐలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషనర్‌పై ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here