Uncategorized

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా

ఇటీవల ఘనంగా చిత్ర ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అయితే దర్శకుడు శంకర్ శైలికి తగ్గట్టే ప్రారంభోత్సవానికి కొద్దిసేపు ముందు చిత్రబృందతో డిజైన్ చేసిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కి, ప్రారంభోత్సవానికి దిల్ రాజు ఖర్చుపెట్టిన బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు కోటిన్నర కేవలం పోస్టర్ అండ్ గ్రాండ్ ఓపెనింగ్‌కి ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

శంకర్ సినిమా అంటే ప్రతీదీ ఎంత కొత్తగా ఉంటుందో అంతే ఖర్చుతోనూ తయారవుతుంది. చరణ్ 15వ సినిమాకి 250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. దిల్ రాజు – శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. సునీల్, అంజలి, జయరాం, రవిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌కి ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఇక త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here