Uncategorized

స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్ద పీసీసీ కార్యదర్శి యార్లపల్లి గోపి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి CWC ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు

స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్ద పీసీసీ కార్యదర్శి యార్లపల్లి గోపి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళి అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి CWC ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతా మోహన్ గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఈ దేశానికి సాంకేతిక విప్లవానికి నాంది అని ఈరోజు మనం ఫోన్ వాడుతున్నావ్ అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి ముందుచూపు అని ఇలా జాతీయ నాయకుల విగ్రహాల కి భద్రత లేకుంటే మరి ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తామని ఆయన విమర్శించారు మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా నగరపాలక సంస్థ అధికారులు చూడాలని లేనిపక్షంలో నగర పాలక సంస్థ అధికారులు తీరని మచ్చ గా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ST సెల్ అధ్యక్షులు సిద్దయ్య ,NSUI నగర నాయకులు షేక్ జావేద్ ,మైనారిటీ నాయకులు అబ్దుల్ మజీద్ పటేల్ ,సమీముల్లాహ్, సుబ్రమణ్యం వెంకటేష్ గౌడ్ గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here