Uncategorized

ఎంసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు

రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆప్షన్ల నమోదు తేదీలను మార్చారు. మారిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18న అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. మొదట నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 30 నుంచి ఈ నెల 9వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఇచ్చారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేస్తారు. 4 నుంచి 13వరకు విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకోవాలి. 15న సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. అయితే..తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆప్షన్ల నమోదు మాత్రం 4 నుంచి కాకుండా 11వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. 16 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 18న సీట్లు కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ప్రక్రియ 18నుంచి 23వరకూ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here