Uncategorized

లెక్కలు మారుతున్నాయ్ మా ‘ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్

Maa Elections 2021 : ‘ మా ‘ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ .. లెక్కలు మారుతున్నాయ్

ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , జీవిత , హేమ , సీఐఎల్ నరసింహారావు ‘ మా ‘ ఎలక్షన్స్ లో నిలబడుతున్నట్టు ప్రకటించారు . పోటీలో అయిదుగురు కనిపిస్తున్న రెండు ప్యానెల్స్ మధ్య ఈ వార్ జరిగేలా అనిపిస్తుంది . మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాష్ రాజ్ , కృష్ణంరాజు , కృష్ణ , బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది . జీవిత , సీనియర్ నటి హేమ మహిళా కార్డుతో పోటీకి సై అన్నారు . సీవిఎల్ నరసింహారావు తెలంగాణ వాదంతో పోటీలో ఉన్నారు . రెండేళ్లు మాత్రమే వుండే ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు బరిలో నిల్చున్నవారు . లోకల్ , నాన్ లోకల్ వాదంతో మొదలైంది ఎన్నికల పోటీ . ఒకరేమో బిల్డింగ్ కడతాం అన్నారు . ఇంకొకరు ‘ మా ‘ సంక్షేమం అంటున్నారు . ఇలా ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇస్తున్నారు . చివరికి ఎవరు ఈ సారి ‘ మా ‘ అసోసియేషన్ అధ్యక్ష పీఠం ఎక్కుతారు అనేది ఆసక్తికరంగా మారింది .

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పోటీ జరగలేదు . ఈసారి మాత్రం ఏకంగా అయిదుగురి పేర్లు తెరపైకి రావడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి . కేవలం ఇగో … వీళ్ళని ఇంతవరకు తెచ్చింది . గత సంవత్సరం నుండే ప్రకాష్ రాజ్ పోటీకి ప్రణాళికలు రచించి , ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు . అందరి కంటే ముందుగా తన ప్యానెల్‌ను ప్రకటించారు . తాను అధ్యక్షుడిని అయితే ఏమి చేస్తానో చెప్పాడు . మెగా బ్రదర్ నాగబాబును పక్కన పెట్టుకుని మెగా కాంపౌండ్ సపోర్ట్ తనకే ఉందని ప్రూవ్ చేసారు .

‘ మా ‘ సభ్యుల చిరకాల స్వపం … మా భవనం తన సొంత ఖర్చులతో కడతానని ప్రకటించాడు మంచు విష్ణు . మా భవనానికి స్థలాలు చూశానని ప్రకటించి ప్రచారంలో ఓ అడుగు ముందుకేసాడు . నటి హేమ ‘ మా ‘ లో వేడి పుట్టించింది . ‘ మా ‘ నిధులను ఖర్చు చేసారు అంటు నరేష్ పై ఆరోపణలు చేసింది . నరేష్ , జీవిత .. హేమ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు . ఆరోపణలు ప్రత్యారోపణలతో పరిస్థితి మరింత దిగజారడంతో సీన్లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి . ‘ మా ‘ సభ్యుల బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి అంటూ లేఖాస్త్రం సంధించాడు .

ప్రస్తుత కమిటీలో సెక్రెటరీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న జీవితకు మంచు విష్ణు ప్యానెల్ లో మరలా సెక్రెటరీ పోస్ట్ రిజర్వ్ చేసినట్లు సమాచారం . జీవిత మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసి మంచు విష్ణు ప్యానల్ మద్దతుతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతు తీసుకునేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది . సంవత్సరం నుంచి ప్యానెల్ ప్లాన్ చేసుకున్న ప్రకాష్ రాజ్ సెక్రెటరీ పోస్ట్ విషయంలో రాజీ పడతాడా ? జీవితకు మద్దతు ఇస్తాడా లేక పోటీగా అభ్యర్థిని బరిలో నిలబెడతారా ? అన్నది చూడాలి .

మరో వైపు ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ మరల పోటీ చేసే అవకాశం ఉంది . ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు . ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న జీవితా రాజశేఖర్ కు మంచు విష్ణు ప్యానల్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది . ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో సెక్రెటరీగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది . జీవితకు పోటీగా సీనియర్ నటి జయసుధను బరిలోకి దింపుతారా లేక సీనియర్ నటుడు బెనర్జీని సెక్రటరీగా పోటీలోకి దింపుతారా లేదా రెండు మానేసి ఇండిపెండెంట్ గా ఉన్న జీవితకు మద్దతు ఇస్తారా ? అనే చర్చ నడుస్తోంది . మరోవైపు నటి హేమ కూడా అధ్యక్ష స్థానం పోటీ విరమించుకుని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఏదో ఒక పదవికి పోటీ చేసే లాగా ప్రకాష్ రాజ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం . ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ గ్రూపు ఓటింగ్ ఇప్పుడు కీలకంగా మారనుంది .

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తన ప్యానెల్ పేర్లను ప్రకటించిన ప్రకాష్ రాజ్ కూడా కొంత మార్చుకునే అవకాశం ఉంది . ఆ ప్యానెల్ లో ప్రకటించిన ఒకరిద్దరు అభ్యర్థులకు పోటీ చేసే హక్కు లేకపోవటంతో వాళ్ళ ప్లే లో కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది . మరోవైపు ప్రకాష్ రాజ్ టీంలోని సీనియర్ నటి జయసుధ ఎన్నికల పోటీ కూడా అనుమానాస్పదమే అంటున్నారు కొందరు . మంచు ఫ్యామిలికి అత్యంత సన్నిహితురాలైన జయసుధ మంచు విష్ణుకు వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం లేదనేది ఫిల్మ్ నగర్ టాక్ . వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడంతో మొదలుపెట్టిన ఎన్నికల ప్రచారం విందు రాజకీయాల వరకు వెళ్ళింది

. మేము అంతా ఒకటే .. ‘ మా ‘ అంతా ఒకటే ఫ్యామిలీ … మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలు అని చెప్పుకునే ‘ మా ‘ సభ్యులు .. ఈ ఎన్నికలకు మాత్రం సాధారణ ఎన్నికల స్థాయిలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు . ఇన్ని మార్పులు చేర్పుల నడుమ , సమయానుకూలంగా గోడ దూకే అభ్యర్థులు ఎవరు , చివరకు ప్రకాష్ రాజ్ టీంలో ఉండేది ఎవరు , మంచు విష్ణు ప్యానెల్ లో ఉండేది ఎవరో మరో వారంలో తెలిసే అవకాశం ఉంది .

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here