Uncategorized

జర్నలిస్టులను సమాజానికి దూరం చేయాలని ప్రభుత్వ కుట్ర ..!

తాత్కాలిక అక్రిడిటేషన్ లుజర్నలిస్టులనుఅవమానించడమే…!!
జర్నలిస్టులందరికీ పూర్తికాలపు అ క్రిడిటేషన్ లు మంజూరు చేయాలి :
ఏపీడబ్ల్యూజే ఎఫ్ నిరసన దీక్షలో రాజకీయ, జర్నలిస్టు సంఘాల నేతల డిమాండ్
కర్నూలు సెప్టెంబర్ 3 : స్థానిక పత్రికల జర్నలిస్టులను సమాజానికి దూరం చేయాల నే కుట్రలో భాగంగానే ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ల లో కోత విధిస్తోం దని పలువురు రాజకీయ ,జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు .తాత్కాలిక అ క్రిడిటేషన్ లు మంజూరు చేస్తామన డం జర్నలిస్టులను తీవ్రంగా అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్థానిక పత్రికల విలేకరులు, కేబుల్ ఛానల్ ల విలేకర్లoదరికీ బేషరతుగా పూర్తి కాలపు అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని వారు ఏపీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో
ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హాజరై సంపూర్ణ సంఘీభావం తెలిపారు. అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు .రాష్ట్రంలో పనిచేస్తున్న విలేకర్లoదరికీ చిన్న ,పెద్ద భేదం లేకుండా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలే వని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గౌరు వెంకటరెడ్డి సూచించారు. అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం స్థానిక పత్రికల విలేకరులను వృత్తి నుంచి సమాజం నుంచి దూరం చేయాలని కుట్ర పన్నుతోందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే 142 జీవో పేరుతో తాత్కాలిక అక్రిడిటేషన్ లు మంజూరు చేస్తామన డం, జర్నలిస్టులను తీవ్రంగా అవమానించడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల ఆందోళనల పట్ల వెంటనే జోక్యం చేసుకుని బేషరతుగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ పూర్తి కాలపు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఐ కలిగిన పత్రికా విలేకరులు, రిజిస్టర్ అయి న కేబుల్ ఛానల్ ల విలేకరుల oదరికీ ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఏపీలో జర్నలిస్టులందరికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు20 లక్ష ల రూపాయల ఆర్థిక సహాయం అందిం చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డు ల తో సంబంధం లేకుండా విలేకర్లoదరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అబ్దుల్ సత్తార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను విభజించి పాలించాలని చూడడం తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు .చిన్నా పెద్దా తేడా లేకుండా పని చేస్తున్న విలేకర్ల అందరికీ వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ విలేకర్ల oదరికీ ప్రభుత్వ ప్రతిఫలాలు అందజేయాలని కోరారు. విలేకర్ల అందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలు మానుకొని జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆయన హితవు పలికారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు సోదరులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూ జేఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు ,నగర అధ్యక్షులు మధుసూదన్రావు, నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు వినయ్ కుమార్ ,జట్స్అధ్యక్షులు పెరుమాళ్ళ రాఘవేంద్ర, అవినాష్ ,పరమేష్ సీమ కిరణం పత్రిక ఎడిటర్ నజీర్ జర్నలిస్టు పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు విజయ్ ,ఆంధ్ర నా డీ ఎడిటర్ జాకీర్ ,భాషా పరమేష్ ,తదితరులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here